నెల్లూరులో రొట్టెల పండుగ ప్రారంభం
ABN , Publish Date - Jun 27 , 2026 | 05:00 AM
రాష్ట్ర పండుగగా నెల్లూరులో రొట్టెల పండుగ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
అభివృద్ధి రొట్టె స్వీకరించిన మంత్రి నారాయణ
నెల్లూరు(సాంస్కృతికం), జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పండుగగా నెల్లూరులో రొట్టెల పండుగ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలిరోజే లక్ష మందికిపైగా భక్తులు స్వర్ణాల చెరువులో వరాల రొట్టెలను అందుకున్నట్టు సమాచారం. శుక్రవారం రాత్రి సందల్‌మాలీ సంప్రదాయబద్ధంగా జరిగింది. రాష్ట్రాభివృద్ధి కోసం మంత్రి నారాయణ అభివృద్ధి రొట్టెను స్వీకరించారు. శనివారం అర్ధరాత్రి తర్వాత బారాషహీద్ దర్గా గంధ మహోత్సవం జరగనుంది.