28 ఇళ్లట.. 76 ఓట్లట!
ABN , Publish Date - Jun 30 , 2026 | 06:50 AM
అక్కడ 28 ఇళ్లున్నాయి. 76 మంది ఓటర్లూ ఉన్నారు. అయితే ఊరే లేదు. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో ఈ వింత వెలుగులోకి వచ్చింది.
ఊరే లేని చోట ఇదో వింత...
అక్కడ 28 ఇళ్లున్నాయి. 76 మంది ఓటర్లూ ఉన్నారు. అయితే ఊరే లేదు. ప్రస్తుతం జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)లో ఈ వింత వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా జలదంకి మండలం కమ్మవారిపాలెం పంచాయతీలో విజయనగరం గ్రామం పోలింగ్ బూత్ సంఖ్య 306. ఓటరు జాబితా పట్టుకొని ‘సర్’ సిబ్బంది సోమవారం ఉదయం గ్రామానికి వెళ్లారు. అక్కడ ఒక్క కు టుంబం కూడా లేదు. ఇళ్లన్నీ కూలిపోయి, శిథిలావస్థకు చేరాయి. దీంతో బీఎల్వో తహసీల్దారు సీతామాలక్ష్మికి సమాచారం అందజేశారు. వెంటనే ఆమె గ్రామానికి చేరుకుని, పాడుబడ్డ ఇళ్లను చూసి నిర్ఘాంతపోయారు. వాస్తవ పరిస్థితిని నమో దు చేయాలని బీఎల్వోను తహసీల్దారు ఆదేశించారు.
- ఆంధ్రజ్యోతి-జలదంకి