Share News

మరణంలోనూ మానవత్వం

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:56 AM

మరణంలోనూ తన అవయవాలను దానం చేసి ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించిన ఆ యువకుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. వివరాలివీ..

మరణంలోనూ మానవత్వం

  • బ్రెయిడ్‌డెడ్‌కు గురైన యువకుడి అవయవదానం

  • ఐదుగురికి పునర్జన్మ

  • గ్రీన్‌చానల్‌ ద్వారా గుండె, ఊపిరితిత్తులు తరలింపు

  • కిమ్స్‌ ఆసుపత్రిలో అవయవాల సేకరణ

నెల్లూరు వైద్యం, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): మరణంలోనూ తన అవయవాలను దానం చేసి ఐదుగురికి పునర్జన్మ ప్రసాదించిన ఆ యువకుడు అందరికీ ఆదర్శంగా నిలిచాడు. వివరాలివీ.. నెల్లూరు నగరంలోని బ్రహ్మానందపురానికి చెందిన ఉలవపాటి వెంకటాద్రి గతంలో జీజీహెచ్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, కుమారుడు జీవ (24) ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసిన అతడి కుమారుడు ఈ నెల 10న నగరంలోని కేవీఆర్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే కిమ్స్‌ ఆసుపత్రికి తరలించగా, పరీక్ష చేసి బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపి, వారిని అవయవ దానానికి ఒప్పించారు. దీనిపై జీవన్‌దాన్‌ సంస్థకు సమాచారం ఇచ్చి, ఆ సంస్థ సూచనల మేరకు జీవ గుండెను తిరుపతిలోని పద్మావతి చిల్ట్రన్‌ హార్ట్‌ సెంటర్‌కు, ఊపిరితిత్తులను చెన్నై అపోలో ఆసుపత్రికి, లివర్‌ను కర్నూలు కిమ్స్‌కు తరలించారు. కిడ్నీలను నెల్లూరు కిమ్స్‌ ఆసుపత్రిలోని బాధితులకు అమర్చనున్నారు.

Updated Date - Jun 14 , 2026 | 05:04 AM