సాయిరెడ్డి కుమార్తె నిర్మాణాలపై అధికారులకు సర్కారు నోటీసులు
ABN , Publish Date - Mar 07 , 2026 | 06:17 AM
భీమిలి బీచ్‌లోని కోస్తా నియంత్రణ మండలి-1 పరిధిలో అనుమతులు లేకుండా శాశ్వత కాంక్రీట్ గోడ నిర్మించిన వ్యవహారంలో ప్రభుత్వం సంబంధిత అధికారులపై...
విశాఖపట్నం, మార్చి 6(ఆంధ్రజ్యోతి): భీమిలి బీచ్‌లోని కోస్తా నియంత్రణ మండలి-1 పరిధిలో అనుమతులు లేకుండా శాశ్వత కాంక్రీట్ గోడ నిర్మించిన వ్యవహారంలో ప్రభుత్వం సంబంధిత అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అవ్యాన్ రియల్టర్స్ పేరుతో పునాదులు, రక్షణ గోడ నిర్మాణాలు చేపట్టిన సంగతి తెలిసిందే. దానిపై జనసేన నాయకుడు పీతల మూర్తియాదవ్ హైకోర్టులో కేసు వేయగా విచారణ చేసి, వాటిని వారి ఖర్చుతో తొలగించాల్సిందిగా ఆదేశించిన సంగతి విదితమే. అక్రమంగా నిర్మాణాలు చేపడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదో రాతపూర్వక వివరణ ఇవ్వాలంటూ అప్పటి భీమిలి జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మి, అసిస్టెంట్ సిటీ ప్లానర్లు శైలజావల్లి, డి.శ్రీనివాసరావు, వార్డు రెగ్యులర్ సెక్రటరీ శైలజాకుమారిలకు ప్రభుత్వం శుక్రవారం నోటీసులు జారీచేసింది.