‘నీరు-చెట్టు’ పనుల్లో ఎలాంటి అక్రమాల్లేవు!
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:00 AM
గత టీడీపీ ప్రభుత్వ హయాం (2014-19)లో భూగర్భ జలాల మట్టాలు పెంచేందుకు చేపట్టిన నీరు-చెట్టు పథకం కార్యక్రమాల్లో అధికారులు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని విజిలెన్స్...
386 మంది జలవనరుల శాఖ ఇంజనీర్లకు క్లీన్‌చిట్
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): గత టీడీపీ ప్రభుత్వ హయాం (2014-19)లో భూగర్భ జలాల మట్టాలు పెంచేందుకు చేపట్టిన నీరు-చెట్టు పథకం కార్యక్రమాల్లో అధికారులు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని విజిలెన్స్ శాఖ తాజా దర్యాప్తు తేల్చింది. దీంతో జలవనరుల శాఖకు చెందిన 386 మంది ఇంజనీరింగ్ అధికారులపై క్రమశిక్షణా చర్యలు చేపట్టాలన్న గత సర్కార్ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. గత ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడితే.. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు బాసటగా నిలిచిందని ఆ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.