ఎన్‌సీసీ శిక్షణలో గురితప్పిన బుల్లెట్
ABN , Publish Date - Jan 28 , 2026 | 05:34 AM
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని ఏడో ఆంధ్ర ఎన్‌సీసీ క్యాడెట్స్ ఫైరింగ్ శిక్షణలో బుల్లెట్ గురితప్పింది. ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
తప్పిన పెనుప్రమాదం
నరసాపురం, జనవరి 27(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని ఏడో ఆంధ్ర ఎన్‌సీసీ క్యాడెట్స్ ఫైరింగ్ శిక్షణలో బుల్లెట్ గురితప్పింది. ఈ ఘటనలో పెనుప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మం గళవారం నరసాపురం వైఎస్ కళాశాల మైదానంలో, ఎన్‌సీసీ ఏబీసీ సర్టిఫికెట్ల జారీలో భాగంగా విద్యార్థులకు ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఒక విద్యార్థి తుపాకీ నుంచి వెళ్లిన బుల్లెట్ సమీపంలోని ఇంటి అద్దాలు పగులగొట్టి లోనికి దూసుకుపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే పరిసర ప్రాంత ప్రజలు ఆ వార్డు టీడీపీ నాయకుడు కొల్లు పెద్దిరాజు దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. నివాసాల మధ్య ఫైరింగ్ చేయడం సరికాదని వెంటనే శిక్షణను ఆపాలని కోరారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.