తూర్పు నౌకాదళాన్ని సందర్శించిన నేవీ చీఫ్
ABN , Publish Date - Jul 16 , 2026 | 05:17 AM
భారత నౌకాదళం ప్రధానా ధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మంగళవారం తూర్పు నౌకాదళాన్ని సందర్శించారు.
విశాఖపట్నం, జూలై 15(ఆంధ్రజ్యోతి): భారత నౌకాదళం ప్రధానా ధికారిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ మంగళవారం తూర్పు నౌకాదళాన్ని సందర్శించారు. ఆయనకు తూర్పు నౌకాదళం అధికారి వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ఇక్కడి ఆపరేషన్ విషయాలన్నీ వివరించారు. నేవీ చీఫ్ సెయిలర్లు, అధికారులతో ముచ్చటించిన నేవీ చీఫ్.. తీరప్రాంత రక్షణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.