Share News

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం

ABN , Publish Date - Jul 15 , 2026 | 12:00 AM

రైతులు మారుతున్న కా లానికి తగ్గట్లు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఎంతో లాభదాయకం ఉంటుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి మాధు రి అన్నారు.

ప్రకృతి వ్యవసాయం లాభదాయకం
పంటలను పరిశీలిస్తున్న జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి మాధురి

మద్దికెర, జూలై 14 (ఆంధ్రజ్యోతి): రైతులు మారుతున్న కా లానికి తగ్గట్లు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఎంతో లాభదాయకం ఉంటుందని జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ అధికారి మాధు రి అన్నారు. మంగళవారం పెరవలి గ్రామంలో ప్రకృతి ఉత్పత్తులతో సాగు చేసిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో వినియోగించే వివిద రకాలైన కాషాయాల మీమాత్రం, బ్రహ్మార్థం, జీవామృతం తయారు చేసుకునే విధానాలు, ఉపయోగించే పద్ధతులు, లాభాల గురించి వివరించారు. పంటలపై క్రిమిసంహారక మందులు వాడకుండా పండించే పంటలు ప్రజలకు ఆరోగ్యాన్ని ఇస్తుందన్నారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం పదిలంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి ఉప్పర రవి, విస్తరణాధికారులు హనుమన్న, భోజరాజు, ఉధ్యానవన సహాయకులు రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 12:00 AM