Share News

టెట్‌పై జాతీయ స్థాయిలో ఉమ్మడి పోరాటం: ఎస్టీయూ

ABN , Publish Date - Jan 05 , 2026 | 04:21 AM

ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు కోసం జాతీయ స్థాయిలో ఉమ్మడి పోరాటం చేయనున్నట్టు...

టెట్‌పై జాతీయ స్థాయిలో ఉమ్మడి పోరాటం: ఎస్టీయూ

అమరావతి, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ నుంచి మినహాయింపు కోసం జాతీయ స్థాయిలో ఉమ్మడి పోరాటం చేయనున్నట్టు రాష్ర్టోపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్‌.సాయి శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం జైపూర్‌లో జరిగిన ఏఐఎస్‌టీఎఫ్‌ జాతీయ కార్యవర్గ సమావేశంలో వారు పాల్గొన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో టెట్‌ మినహాయింపునకు చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేసినట్టు తెలిపారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణ సంస్థ నిర్లక్ష్యం వల్లే ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ తప్పనిసరి అనే తీర్పు వచ్చిందని అభిప్రాయపడ్డారు.

Updated Date - Jan 05 , 2026 | 04:23 AM