Visakhapatnam: 28, 29 తేదీల్లో విశాఖలో జైళ్ల శాఖ జాతీయ సదస్సు
ABN , Publish Date - Jan 20 , 2026 | 04:28 AM
జైళ్ల శాఖ తొమ్మిదో జాతీయ సదస్సును ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్నట్టు విశాఖ కేంద్ర కారాగారం ఇన్‌చార్జి సూపరింటెండెంట్...
విశాఖపట్నం, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): జైళ్ల శాఖ తొమ్మిదో జాతీయ సదస్సును ఈ నెల 28, 29 తేదీల్లో విశాఖలో నిర్వహిస్తున్నట్టు విశాఖ కేంద్ర కారాగారం ఇన్‌చార్జి సూపరింటెండెంట్, సదస్సు నోడల్ అధికారి ఎం.మహే్‌షబాబు తెలిపారు. భీమిలి బీచ్ రోడ్డులో రుషికొండ వద్ద గల సాయిప్రియ రిసార్ట్స్‌లో జరిగే ఈ సదస్సుకు కేంద్ర పాలిత ప్రాంతాలు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన జైళ్ల శాఖ డీజీపీలు, ఐజీ స్థాయి అధికారులు హాజరవుతారన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో జైళ్ల శాఖలో రాష్ట్రాలవారీగా అమలుచేస్తున్న సంస్కరణలు, విధానాలతోపాటు సవాళ్లపై చర్చిస్తారని తెలిపారు. సదస్సు ప్రారంభానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ముగింపు సదస్సుకు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు.