రేపటి నుంచి గుంటూరులో ఏఐకేఎస్ జాతీయ సమావేశాలు
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:30 AM
ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 29 నుంచి నాలుగు రోజులు గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపం...
గుంటూరు(తూర్పు), జనవరి 27(ఆంధ్రజ్యోతి): ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 29 నుంచి నాలుగు రోజులు గుంటూరులోని టీటీడీ కల్యాణ మండపం, శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నట్టు ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకరరెడ్డి తెలిపారు. గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ఎంపీ, ఏఐకేఎస్ అధ్యక్షుడు అశోక్ ధావలే, కార్యదర్శి విజుకృష్ణన్, మాజీ కార్యదర్శి హానన్వెల్లా, కోశాధికారి కృష్ణప్రసాదు, రైతు సంఘాల కన్వీనర్ వడ్డే శోభానాద్రీశ్వరరావుతో పాటు వివిధ రైతాంగ ఉద్యమాల్లో పాల్గొన్న 300 మంది రైతు నాయకులు సమావేశాలకు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు. ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ సమావేశాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వీసీ ఆర్.శారదా జయలక్ష్మిదేవి, ఏఐకేఎస్ ఆలిండియా ప్రధాన కార్యదర్శి విజూకృష్ణన్ తదితరులు ప్రారంభిస్తారని తెలిపారు.