Share News

శ్రీవారికి నాసా శాస్త్రవేత్త నృత్యార్చన

ABN , Publish Date - Feb 22 , 2026 | 04:17 AM

నాసా స్పేస్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ కావ్య కె మన్యపు తిరుమలేశుడికి నృత్యార్చన సమర్పించారు.

శ్రీవారికి నాసా శాస్త్రవేత్త నృత్యార్చన

తిరుమల, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): నాసా స్పేస్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌ కావ్య కె మన్యపు తిరుమలేశుడికి నృత్యార్చన సమర్పించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ముందున్న నాదనీరాజనం వేదికపై తన బృందంతో కలిసి శనివారం అద్భుత భరతనాట్య ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకుల మనసు దోచారు. హైదరాబాద్‌కు చెందిన కావ్య అమెరికాలో నివాసముంటూ నాసాలో శాస్త్రవేత్తగా పని చేస్తున్నారు.

Updated Date - Feb 22 , 2026 | 04:19 AM