Share News

దవడ ఎముకలోకి దూసుకెళ్లిన గోలీ

ABN , Publish Date - Jul 01 , 2026 | 05:18 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గంపరాయి గ్రామానికి చెందిన మర్రి ఏలియా(7)ని జూన్‌ 21న అతని తమ్ముడు క్యాట్‌బాల్‌లో గోలీ పెట్టి కొట్టాడు.

దవడ ఎముకలోకి దూసుకెళ్లిన గోలీ

  • గిరిజన బాలుడికి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో శస్త్రచికిత్స

నర్సీపట్నం, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గంపరాయి గ్రామానికి చెందిన మర్రి ఏలియా(7)ని జూన్‌ 21న అతని తమ్ముడు క్యాట్‌బాల్‌లో గోలీ పెట్టి కొట్టాడు. ఆ గోలీ ఏలియా దవడ ఎముకలోకి దూసుకుపోయింది. ఏలియాను, కుటుంబ సభ్యులు కృష్ణాదేవిపేట పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దవడ ఎముకలో గోలీ ఉన్న విషయాన్ని బాలుడు ఈఎన్‌టీ వైద్యుడితో చెప్పాడు. 22న ఎక్స్‌రే, సీటీ స్కాన్‌ చేసి గోలీ ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ఈఎన్‌టీ వైద్య నిపుణులు వరప్రసన్న, కుసుమిత సర్జరీ చేయడానికి ముందుకువచ్చారు. మత్తు వైద్యులు మల్లికార్జునరావు, నరేంద్రతో చర్చించి, 24న ఆపరేషన్‌ చేశారు. అతి కష్టమ్మీద బాలుడు దవడ ఎముకలో ఇరుక్కున్న గోలీని బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పారు. వైద్య బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుధాశారద అభినందించారు.

Updated Date - Jul 01 , 2026 | 05:20 AM