బిల్డ్ ఏపీ లక్ష్యంతో నిర్మాణ రంగానికి ప్రభుత్వ తోడ్పాటు
ABN , Publish Date - May 12 , 2026 | 05:14 AM
నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఏపీ ప్రతినిధి బృందం సూచనలు, సలహాలు ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకుందని, బిల్డ్ ఏపీ లక్ష్యంతో నిర్మాణ రంగాన్ని మళ్లీ పుంజుకునేలా ప్రభుత్వం తన వంతు ...
కొనియాడిన నరెడ్కో రాష్ట్ర నూతన కార్యవర్గం
విజయవాడ సిటీ, మే 11 (ఆంధ్రజ్యోతి): నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఏపీ ప్రతినిధి బృందం సూచనలు, సలహాలు ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకుందని, బిల్డ్ ఏపీ లక్ష్యంతో నిర్మాణ రంగాన్ని మళ్లీ పుంజుకునేలా ప్రభుత్వం తన వంతు తోడ్పాటు అందిస్తోందని నూతన అధ్యక్షుడు చక్రధర్ తెలిపారు. నరెడ్కో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నింగ్ కమిటీని సోమవారం విజయవాడలో ఎన్నుకున్నారు. చైర్మన్‌గా చుక్కపల్లి రమేశ్, అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా గద్దె చక్రధర్, గద్దె తిరుపతిరావు, కోశాధికారిగా కాటసాని హరిశంకర్‌రెడ్డి ఎన్నికయ్యారని సంస్థ నూతన కార్యదర్శి పరుచూరి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండేళ్లుగా నరెడ్కో ఏపీ ప్రతినిధి బృందాలు సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణతో ప్రత్యేకంగా సమావేశమయ్యాయని, వారి సూచనలకు తగినట్టుగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వేగవంతమైన నిర్మాణ అనుమతులు, లే అవుట్ ప్రమాణాలు, పన్నుల భారాల విషయాల్లో మార్పులు వచ్చాయని చక్రధర్ వివరించారు. ఈ నూతన మార్పులు ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి బలాన్ని ఇవ్వనున్నాయని పేర్కొన్నారు.