ఈగల్‌కు ఎన్‌డీపీఎస్ నియంత్రణ అధికారాలు
ABN , Publish Date - Feb 26 , 2026 | 06:00 AM
నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ పదార్థాలు(ఎన్‌డీపీఎస్), గంజాయిపై నియంత్రణ అధికారాలను ఈగల్‌కు అప్పగిస్తూ ఎక్సైజ్ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.
సెబ్ రద్దు నేపథ్యంలో నిర్ణయం
ఇంటర్నెట్ డెస్క్: నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ పదార్థాలు(ఎన్‌డీపీఎస్), గంజాయిపై నియంత్రణ అధికారాలను ఈగల్‌కు అప్పగిస్తూ ఎక్సైజ్ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గత ప్రభుత్వంలో ఈ అధికారాలను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో(సెబ్)కు అప్పగించగా, కూటమి ప్రభుత్వం సెబ్‌ను రద్దుచేసింది. ఈ నేపథ్యంలో ఆ అధికారాలను ఈగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్‌కు అప్పగిస్తున్నట్లు తాజా ఉత్తర్వుల్లో ఎక్సైజ్ శాఖ తెలిపింది.