Share News

ఇంటర్‌ ఫలితాల్లో నారాయణ సరికొత్త రికార్డులు

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:40 AM

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థలు రికార్డులు సృష్టించాయి. ఎంపీసీ విభాగంలో తమ విద్యార్థి మానస 470 మార్కులకు 460 మార్కులు సాధించినట్టు...

ఇంటర్‌ ఫలితాల్లో నారాయణ సరికొత్త రికార్డులు

అమరావతి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థలు రికార్డులు సృష్టించాయి. ఎంపీసీ విభాగంలో తమ విద్యార్థి మానస 470 మార్కులకు 460 మార్కులు సాధించినట్టు నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్‌ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. జూనియర్‌ బైపీసీ విభాగంలో తమ విద్యార్థులు ఫెయిత్‌ హియాల్‌, మసీహా 455 మార్కులకు గాను 452 మార్కులు సాధించారని తెలిపారు. సీనియర్‌ ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను నాగ తేజశ్రీ 993 మార్కులు, సీనియర్‌ ఇంటర్‌ బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను తమ విద్యార్థి టి.సతీష్ రెడ్డి టాప్‌ మార్కు 991 సాధించినట్టు వెల్లడించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన తమ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి నారాయణ విద్యాసంస్థల తరఫున అభినందనలు తెలియజేశారు.

Updated Date - Apr 16 , 2026 | 04:40 AM