తిరుపతిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ: నారాయణ
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:37 AM
కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుపతిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టే యోచన చేస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు.
అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరుపతిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం చేపట్టే యోచన చేస్తామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు. తిరుపతిలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ తిరుపతిలో 408.4 కిలోమీటర్ల పరిధిలో యూజీడీ అవసరముందన్నారు. పాత వాటిలో 7.5 కిలోమీటర్లు లైన్ మార్చేందుకు మార్చిలో టెండర్లు పిలుస్తున్నామన్నారు. మిగతా ప్రాంతంలో యూజీడీ కోసం నిధులపై కేంద్రంతో సంప్రదించి ముందుకెళ్తున్నామన్నారు. స్వచ్ఛ ఆంధ్ర సాధించాలంటే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేయాలన్నారు. తుని పట్టణంలోనూ అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే యనమల దివ్య కోరారు.