నారాయణ చారిత్రక విజయం
ABN , Publish Date - May 01 , 2026 | 04:49 AM
పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్ధులు పది మంది 598 అత్యధిక మార్కులు సాధించి చర్రిత సృష్టించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ...
విజయవాడ (భారతీనగర్), ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి ఫలితాల్లో తమ విద్యార్ధులు పది మంది 598 అత్యధిక మార్కులు సాధించి చర్రిత సృష్టించారని నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. గురువారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరచడంతో విజయవాడలోని నారాయణ స్కూల్‌లో విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ మాట్లాడుతూ 597 మార్కులు తొమ్మది మంది, 596 మార్కులు 33 మంది, 595 మార్కులు 37 మంది, 594 మార్కులు 50 మంది, 593 మార్కులు 63 మంది, 592 మార్కులు 91 మంది, 591 మార్కులు 116 మంది, 590 మార్కులు 99 మంది సాధించారని వెల్లడించారు. నారాయణ విద్యాసంస్ధలో గణితంలో 100కి 100 మార్కులు 2786 మంది, సైన్స్‌లో 100కి 100 మార్కులు 782 మంది, సంఘిక శాస్త్రంలో 100కి 100 మార్కులు 1284 మంది, తెలుగులో 100కి 100 మార్కులు 2432 మంది విద్యార్ధులు సాధించారన్నారు. అంధ్రప్రదేశ్‌లో 520.7 సగటు మార్కులు సాగించిన ఏకైక విద్యాసంస్ధ నారాయణ మాత్రమే అని స్పష్టంచేశారు. నారాయణ విద్యాసంస్థల కోర్ కమిటీ సభ్యురాలు రమా నారాయణ మాట్లాడుతూ రికార్డు స్థాయి మార్కులు సాధించడం, ఏటేటా నారాయణ ఫలితాలను నారాయణ విద్యార్థులే అధిగమించడం ఓ ఆనవాయితీగా మారిందని అన్నారు.