Share News

Narayana Educational Institutions: 14 కొత్త క్యాంప్‌సలతో ‘నారాయణ’ విస్తరణ

ABN , Publish Date - Jan 20 , 2026 | 05:27 AM

రాష్ట్రంలో 14 నూతన క్యాంప్‌సలను ప్రారంభిస్తున్నట్లు నారాయణ విద్యా సంస్థ ప్రకటించింది. వీటిలో 10 పాఠశాలలు...

Narayana Educational Institutions: 14 కొత్త క్యాంప్‌సలతో ‘నారాయణ’ విస్తరణ

అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 14 నూతన క్యాంప్‌సలను ప్రారంభిస్తున్నట్లు నారాయణ విద్యా సంస్థ ప్రకటించింది. వీటిలో 10 పాఠశాలలు, నాలుగు జూనియర్‌ కళాశాలలు ఉన్నాయని వెల్లడించింది. తిరుపతి, అనంతపురం, శ్రీకాకుళం, భీమవరం, విశాఖపట్నం, విజయవాడ, కడప, కర్నూలు, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్న ఈ క్యాంప్‌సలతో నారాయణ విద్యాసంస్థల సంఖ్య 406కు చేరుకుంటుందని ఆ సంస్థ తెలిపింది. 47 ఏళ్ల సుదీర్ఘ అనుభవంతో విద్యార్థులకు వ్యక్తిగత మార్గదర్శకత్వం, అత్యాధునిక డిజటిల్‌ బోధనా పద్ధతులు, సంపూర్ణ వికాసంపై దృష్టి సారించడం ఈ విస్తరణ లక్ష్యమని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్‌ పునిత్‌ కొత్తప ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలలో 250కి పైగా నగరాల్లో 950కి పైగా క్యాంప్‌సలతో విస్తరించిన భారీ నెట్‌వర్క్‌ నారాయణ సొంతమని పునిత్‌ తెలిపారు. 50 వేల మంది అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, సబ్జెక్ట్‌ నిపుణులు నారాయణలో సేవలందిస్తున్నారని కిండర్‌ గార్డెన్‌ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ వరకూ 6 లక్షల మంది విద్యార్థులు నారాయణ విద్యా సంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారని పునిత్‌ వివరించారు.

Updated Date - Jan 20 , 2026 | 05:29 AM