నేడు నరసరావుపేటలో మెగా రుణమేళా
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:07 AM
కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా రుణమేళా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శుక్రవారం జరుగనుంది.
రూ.2,500 కోట్ల రుణ పంపిణీకి ఏర్పాట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల, సీఎం చంద్రబాబు రాక
నరసరావుపేట, జూలై 16(ఆంధ్రజ్యోతి): కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా రుణమేళా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శుక్రవారం జరుగనుంది. కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. సభకు 30,000 మంది హాజరయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పీఎంఎఫ్ఎంఈ, పీఎంఈజీపీ, ముద్ర, ఎంఎస్ఎంఈ, వ్యవసాయం, విద్య, కిసాన్ క్రెడిట్ కార్డు తదితర పథకాల లబ్ధిదారులకు రూ.2,500 కోట్ల రుణాలను పంపిణీ చేయనున్నారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారి నుంచి సామాన్యులను తప్పించి సంస్థాగత పరపతిని పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కేంద్ర పథకాల కింద రుణాలను నేరుగా అర్హులకు అందజేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు.