క్యాంపస్ సెలక్షన్‌లో 117 మందికి ఉద్యోగాలు
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:29 AM
పల్నాడు జిల్లా నరసరావుపేటలోని నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జరిగిన క్యాంపస్ సెలక్షన్‌లో 117 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
విద్యార్థులను అభినందించిన నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్
నరసరావుపేట రూరల్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లా నరసరావుపేటలోని నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం జరిగిన క్యాంపస్ సెలక్షన్‌లో 117 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. సవంతీస్ కంపెనీ ప్రాంగణ ఎంపికలు నిర్వహించింది. ఈ క్రమంలో 117 మందిని ఎంపిక చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ విద్యార్థులకు వార్షిక వేతనం రూ.3 లక్షల నుంచి రూ.4.5 లక్షల వరకు అందనుందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మిట్టపల్లి వెంకటకోటేశ్వరరావు, సెక్రటరి మిట్టపల్లి రమేష్, మిట్టపల్లి చక్రవర్తి ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను అభినందించారు.