Share News

ఏపీపీఎస్సీ అంటే ఏంటో తెలియదు.. డీఎస్సీకీ జగన్‌కు అర్థం తెలియదు: లోకేశ్‌

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:08 AM

‘ఏపీపీఎస్సీ అంటే ఏంటో తెలియదు. డీఎస్సీకీ అర్థం తెలియదు’ అంటూ జగన్‌ను ఉద్దేశించి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు.

ఏపీపీఎస్సీ అంటే ఏంటో తెలియదు.. డీఎస్సీకీ జగన్‌కు అర్థం తెలియదు: లోకేశ్‌

అమరావతి, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): ‘ఏపీపీఎస్సీ అంటే ఏంటో తెలియదు. డీఎస్సీకీ అర్థం తెలియదు’ అంటూ జగన్‌ను ఉద్దేశించి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్‌ ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. గురువారం ప్రెస్‌మీట్‌లో జగన్‌... ఏపీపీఎస్సీ, డీఎస్సీ అంటే ఒక్కటేనని మాట్లాడారు. దానిపై స్పందించిన లోకేశ్‌.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఏ పరీక్షలు నిర్వహిస్తుందో, ఆ విధి విధానాలేంటో కనీసం తెలియని జగన్‌ తన పాలనా కాలంలో ఒక్క డీఎస్సీని కూడా నిర్వహించలేకపోయారు. ఇప్పుడు అసెంబ్లీలో చర్చ నుంచి పారిపోతున్నారు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 04:08 AM