కలకత్తా కాళిని దర్శించుకున్న లోకేశ్
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:41 AM
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ కోల్‌కతాలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించారు. కోల్‌కతా పర్యటనలో ఉన్న లోకేశ్ శుక్రవారం కాళీ మాత ఆలయానికి వెళ్లారు.
ఇంటర్నెట్ విభాగం: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ కోల్‌కతాలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించారు. కోల్‌కతా పర్యటనలో ఉన్న లోకేశ్ శుక్రవారం కాళీ మాత ఆలయానికి వెళ్లారు. ఆలయ కమిటీ ప్రతినిధులు లోకేశ్‌కు స్వాగతం పలికారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసిన లోకేశ్.. కాళీమాతను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఏపీ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించేలా ఆశీర్వదించాలని కాళీమాతను వేడుకున్నానని లోకేశ్ తెలిపారు.