మార్పు కోసం రాజకీయాల్లోకి రండి
ABN , Publish Date - Aug 23 , 2026 | 04:35 AM
సమాజంలో మార్పు తీసుకురావాలంటే విద్యావంతులు, యువత రాజకీయాల్లోకి రావాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. రాజకీయం కేవలం పదవుల కోసమే కాదని..
ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో మార్పు తీసుకురావాలంటే విద్యావంతులు, యువత రాజకీయాల్లోకి రావాలని మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. రాజకీయం కేవలం పదవుల కోసమే కాదని, ప్రజల జీవితం, సమాజ భవిష్యత్తును ప్రభావితం చేసే కీలకమైన వేదిక అని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతోపాటు సమకాలీన అంశాలు, ప్రపంచ పరిణామాలు, దేశ అభివృద్ధి, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, జనరల్ నాలెడ్జ్‌పై అవగాహన పెంచుకోవాలన్నారు. సమాజం, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి ముందుకొచ్చిన దివీస్ లాబొరేటరీస్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.