Share News

నాడు తాత.. నేడు మనవడు!

ABN , Publish Date - Jul 24 , 2026 | 05:04 AM

పోలవరం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్‌ గురువారం రాత్రి రంపచోడవరం చేరుకున్నారు. విజయవాడ నుంచి విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న లోకేశ్‌..

నాడు తాత.. నేడు మనవడు!

  • మన్యంలోని గిరిజన గూడెంలో రాత్రి బసచేసిన మంత్రి లోకేశ్‌

రంపచోడవరం, జూలై 23(ఆంధ్రజ్యోతి): పోలవరం జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్‌ గురువారం రాత్రి రంపచోడవరం చేరుకున్నారు. విజయవాడ నుంచి విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్న లోకేశ్‌.. అక్కడ నుంచి కారులో నేరుగా ఏజెన్సీకి వచ్చారు. ఇక్కడొక ఆసక్తికర విషయం చర్చనీయాంశమైంది. తన తాత నందమూరి తారక రామారావు తర్వాత ఓ గిరిజన గ్రామంలో బసచేసి, ఆ చరిత్రను లోకేశ్‌ తిరగరాశారు. నాడు 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దివంగత ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో మన్యం వచ్చారు. మారేడుమిల్లి మండలం పందిరిమామిడికోటలో గుడారం వేసుకుని బసచేశారు. ఇప్పుడు ఆయన మనవడు లోకేశ్‌ అక్కడకు సమీపంలోని రంపచోడవరం మండలం ఐ.పోలవరం శివారు జాగరంపల్లి గిరిజనగూడెంలో బసచేయడం విశేషం. రంపచోడవరంలో అన్ని హంగులతో ప్రభుత్వ అతిఽథి గృహాలు ఉన్నా.. లోకేశ్‌ వాటిని కాదని జాగరంపల్లి వచ్చారు. గురువారం రాత్రి 9.30 గంటలకు జాగరంపల్లికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు జిల్లా కలెక్టర్‌ కె.దినేష్ కుమార్‌, ఎస్పీ అమిత్‌బర్దర్‌తో పాటు ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, అరకు పార్లమెంటు పార్టీ అధ్యక్షురాలు మోజోరు తేజోవతి, పలువురు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు.

Updated Date - Jul 24 , 2026 | 05:06 AM