రేపటి నుంచి లోకేశ్ రష్యా టూర్
ABN , Publish Date - Jun 01 , 2026 | 06:12 AM
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ మంగళవారం నుంచి రష్యాలో పర్యటించనున్నారు.
అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ మంగళవారం నుంచి రష్యాలో పర్యటించనున్నారు. జూన్ 2 నుంచి 7 వరకు ఆయన రష్యాలో పర్యటిస్తారు. సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో జరిగే ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సిందిగా లోకేశ్‌కు ఆహ్వానం అందింది. ఈ క్రమంలో రష్యాలోని పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు.