మాస్కో చేరుకున్న లోకేశ్
ABN , Publish Date - Jun 03 , 2026 | 04:17 AM
రష్యా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ మంగళవారం సాయంత్రం మాస్కో చేరుకున్నారు. అక్కడ ఆయనకు ....
అమరావతి, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): రష్యా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ మంగళవారం సాయంత్రం మాస్కో చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిఖిలేశ్ గిరి, పలువురు ప్రవాసాంధ్రులు స్వాగతం పలికారు. ఈనెల 7వరకు ఆయన రష్యాలో పర్యటించనున్నారు. సెయింట్ పీటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో లోకేశ్ పాల్గొననున్నారు.