Share News

మాస్కో ట్రాన్స్‌పోర్టు అద్భుతం

ABN , Publish Date - Jun 04 , 2026 | 05:07 AM

మాస్కో అడ్వాన్స్‌డ్‌ ట్రాన్స్‌పోర్టు డెవల్‌పమెంట్‌ సెంటర్‌ పనితీరు అద్భుతమని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్‌ కొనియాడారు. రష్యా పర్యటనలో ఉన్న మం త్రి బుధవారం ఆ సెంటర్‌ను సందర్శించారు.

మాస్కో ట్రాన్స్‌పోర్టు అద్భుతం

  • భారత్‌కు కూడా ఇలాంటి వ్యవస్థ కావాలి

  • సాంకేతికతతో ప్రయాణికులకు సౌకర్యం

  • మాస్కో పర్యటన సందర్భంగా మంత్రి లోకేశ్‌

  • అడ్వాన్స్‌డ్‌ ట్రాన్స్‌పోర్టు సెంటర్‌ సందర్శన

అమరావతి, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): మాస్కో అడ్వాన్స్‌డ్‌ ట్రాన్స్‌పోర్టు డెవల్‌పమెంట్‌ సెంటర్‌ పనితీరు అద్భుతమని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి లోకేశ్‌ కొనియాడారు. రష్యా పర్యటనలో ఉన్న మం త్రి బుధవారం ఆ సెంటర్‌ను సందర్శించారు. భారత్‌లోనూ ఇలాంటి సెంటర్‌లు ఉండాలని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో మాస్కో అడ్వాన్స్‌డ్‌ ట్రాన్స్‌పోర్టు సెంటర్‌ ఒకటని అన్నారు. ఇది రవాణా నెట్‌వర్క్‌ నిర్వహణ, డిజిటలైజేషన్‌, ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక సాంకేతిక వ్యవస్థను కలిగి ఉందని వెల్లడించారు. ఇక్కడ మెట్రో, బస్సులు, ట్రాలీలు, ఎలక్ట్రిక్‌ రైళ్లు, బైక్‌ -షేరింగ్‌, స్కూటర్లు వంటి వాటిని అన్నింటిని ఏఐ ఆధారిత ట్రాఫిక్‌ నిర్వహణ వ్యవస్థతో అనుసంధానించడం బాగుందని చెప్పారు. వీటిని ప్రయాణికులు ఒకే ప్లాట్‌ఫారం కింద ఉపయోగించుకోవచ్చన్నారు. పట్టణ శివారు ప్రాంతాలను పట్టణంలోని ప్రధాన కేంద్రాలతో అనుసంధానించే రైలు ప్రాజెక్టు మాస్కో సెంట్రల్‌ డయామీటర్స్‌(ఎంసీడీ) కూడా ఇందులో అంతర్భాగంగా ఉండటం విశేషమన్నారు. ఇది నగరంలో మెట్రో రద్దీని తగ్గించడానికి ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. మాస్కో అడ్వాన్స్‌డ్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సెంటర్‌, ట్రాన్స్‌పోర్టు సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌ సెంటర్లలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, సీసీ కెమెరాల ద్వారా నగరంలోని ట్రాఫిక్‌, భద్రతను పర్యవేక్షించడంపై లోకేశ్‌ ఆసక్తి చూపారు. కాగా, మంత్రి లోకేశ్‌ బృందానికి స్వాగతం పలికిన వారిలో మాస్కో ట్రాన్స్‌పోర్టు కాంప్లెక్స్‌ సమాచార సాంకేతిక వ్యవస్థ, కమ్యూనికేషన్‌ డైరెక్టరేట్‌, అటానమస్‌ ట్రాన్స్‌పోర్టు రీసెర్చ్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ విభాగాధిపతి పావెల్‌బోక్షా, సెంటర్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ ఎఫైర్స్‌ హెడ్‌ ఓల్గా పిచికోవా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌పోర్టు అండ్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ సీనియర్‌ ప్రాజెక్టు మేనేజర్‌ అలెగ్జాండర్‌ సువోరోవ్‌, మాస్కో ట్రాఫిక్‌ కంట్రోల్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జనరల్‌ సలహాదారు మస్తిస్లావ్‌ ఇపాకోచ్‌ ఉన్నారు. యాంపీ ధియేటర్‌లో మాస్కో అటానమస్‌ ట్రాన్స్‌పోర్టు సెంటర్‌ అభివృద్ధి గురించి పావెల్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా లోకేశ్‌ బృందానికి వివరించారు. ఈ సెంటర్‌ కార్యకలాపాలు, పనితీరు గురించి మస్తిస్లావ్‌ ఇపాకోచ్‌ వివరించారు. ఆ తర్వాత సమీపంలోని అధునాతన టికెటింగ్‌ సిస్టమ్స్‌ డెవల్‌పమెంట్‌ లేబోరేటరీని లోకేశ్‌ పరిశీలించారు.


విశాఖ, నెల్లూరులో పెట్టుబడులు పెట్టండి

విశాఖలో ఎలకా్ట్రనిక్స్‌ కాంపోనెంట్‌ అసెంబ్లీ యూనిట్‌ను, నెల్లూరులో సెమీకండక్టర్‌ పరికరాల తయారీ యూనిట్‌ను, శ్రీసిటీలో రోబోటిక్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ సేవలను విస్తరించాలని ఎలిమెంట్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌ ఖజోన్‌ ఓలెగ్‌ను మంత్రి లోకేశ్‌ కోరారు. రష్యాకు చెందిన ప్రఖ్యాత సెమీకండక్టర్స్‌ తయారీ సంస్థ ఎలిమెంట్‌ గ్రూప్‌ అధ్యక్షుడు ఖజోన్‌ ఓలెగ్‌తో మంత్రి భేటీ అయ్యారు. ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, ప్రాజెక్టు హెడ్‌ జఖరోవ్‌ ఆంటోని, చీఫ్‌ ఎక్స్‌టర్నల్‌ రిలేషన్స్‌ స్పెషలిస్ట్‌ సిడోమక్‌ ఎతిజవెటాతోనూ లోకేశ్‌ సమావేశమయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భారత్‌లో విస్తరిస్తున్న డిజిటల్‌ రవాణా, ల్యాండింగ్‌ కార్డ్‌ వ్యవస్థలకు సురక్షితమైన ఆర్‌ఎ్‌ఫఐడీ ట్యాడ్‌లు, స్మార్ట్‌ కార్డ్‌ మైక్రోచి్‌పలను స్థానికంగా తయారు చేసేందుకు ఎలిమెంట్‌ గ్రూప్‌ వైజాగ్‌లో ఒక ఎలకా్ట్రనిక్‌ కాంపోనెంట్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ను స్థాపించాలని లోకేశ్‌ కోరారు. అలాగే భాగస్వామ్య సంస్థలతో కలిసి నెల్లూరులో సిలికాన్‌ కార్బైడ్‌, పవర్‌ సెమీ కండక్టర్‌ పరికరాల తయారీ విభాగాలను ఏర్పాటు చేయాలని కోరారు. కమ్యూనికేషన్‌, నావిగేషన్‌, ఏరోస్పేస్‌, ఆన్‌బోర్డు టెలిమెట్రీ సిస్టమ్స్‌ కోసం మాడ్యులర్‌ కాంపోనెంట్స్‌ను తయారు చేసే యూనిట్‌ను శ్రీసిటీలో స్థాపించడంపై దృష్టి సారించాలని కోరారు.

అగ్రి ఎక్స్‌పోర్టర్లకు రుణాలు ఇవ్వండి

రష్యా ప్రభుత్వానికి చెందిన ప్రముఖ రిటైల్‌ బ్యాంకింగ్‌ సంస్థ స్బేర్‌బ్యాంక్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆల్బర్ట్‌ యెఫిమోవ్‌తో మంత్రి లోకేశ్‌ భేటీ అయ్యారు. టెక్నాలజీలో ప్రపంచ భాగస్వామ్యాన్ని నిర్మించే విధానంలో భాగంగా రష్యాలో ప్రఖ్యాత ఫైనాన్షియల్‌, టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన స్బేర్‌బ్యాంక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌తో ఈ భేటీ జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌, సైబర్‌ సెక్యూరిటీ, ఫిన్‌టెక్‌, నైపు ణ్య శిక్షణ, పాలనలో టెక్నాలజీ వినియోగంపై చర్చలు జరిగాయంది. భారత్‌లో బ్యాంకింగ్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, రిటైల్‌ రంగాలకు స్బేర్‌బ్యాంక్‌ గిగాచాట్‌ ఎల్‌ఎల్‌ఎంను విస్తరించాలని కోరినట్లు లోకేశ్‌ తెలిపారు.

Updated Date - Jun 04 , 2026 | 05:07 AM