అతుకుల్లేని జెండా రూపశిల్పి సత్యనారాయణకు లోకేశ్ అభినందన
ABN , Publish Date - May 07 , 2026 | 04:27 AM
అశోక చక్రంతోసహా ఎటువంటి అతుకులు లేని జాతీయ జెండాను తయారు చేసిన నేతన్నను పలు అంతర్జాతీయ రికార్డులు వరించాయి.
అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): అశోక చక్రంతోసహా ఎటువంటి అతుకులు లేని జాతీయ జెండాను తయారు చేసిన నేతన్నను పలు అంతర్జాతీయ రికార్డులు వరించాయి. ఎంతో ఘనతను సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వేమవరానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణను మంత్రి లోకేశ్ అభినందించారు. బుధవారం సాయంత్రం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో లోకేశ్‌ను, సత్యనారాయణ కలిశారు. ‘తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఎగురవేసే 6గీ12 సైజు జెండాను, తర్వాత ఎర్రకోటపై ఎగురవేసే 8గీ12 జాతీయ జెండాను తయారు చేశా. ఆంధ్రకు గుర్తింపు రావాలన్న ఆకాంక్షతోనే దేశంలోనే అత్యంత అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాను రూపొందించా’ అని సత్యనారాయణ అన్నారు. తన మనసుకు దగ్గరైన చేనేతతో అతుకులు లేని జాతీయ జెండా తయారు చేసిన సత్యనారాయణ కృషిని లోకేశ్ అభినందించారు.