కొరియా రాయబారితో లోకేశ్ భేటీ
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:37 AM
భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి లీ సియోంగ్ హోతో రాష్ట్ర మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. సోమవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఆ దేశ కంపెనీల విస్తరణపై చర్చ
న్యూఢిల్లీ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి లీ సియోంగ్ హోతో రాష్ట్ర మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు. సోమవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశంలో కొరియన్ కంపెనీల విస్తరణ, భవిష్యత్తులో ఇరుదేశాల నడుమ మరింత సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. సెమీకండక్టర్లు, మైక్రో ఎలకా్ట్రనిక్స్, స్టోరేజ్, నౌకా నిర్మాణం, ఎలక్ట్రిక్ వాహనాల రంగాల్లో కొరియా ప్రపంచ అగ్రగామిగా ఉంది. దేశంలో కొరియన్ కంపెనీలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా దీర్ఘకాలిక భాగస్వామిగా నిలవగలదనే అంశంపై మంత్రి లోకేశ్ చర్చించారు.