Share News

ఏపీ-కొరియా భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం

ABN , Publish Date - Jul 11 , 2026 | 04:26 AM

ఆంధ్రప్రదేశ్‌-కొరియా భాగస్వామ్యంలో కొత్త అఽధ్యాయం ప్రారంభమవుతోందని ఐటీ, విద్య, ఎలకా్ట్రనిక్స్‌ శాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. దక్షిణకొరియా పర్యటనలో..

ఏపీ-కొరియా భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం

  • పెట్టుబడిదారులతో శాశ్వత భాగస్వామ్య నిర్మాణమే లక్ష్యం

  • కొరియాతో ఏపీది విజయవంతమైన భాగస్వామ్యం

  • సియోల్‌లో సీఐఐ పార్టనర్‌షిప్‌ సమ్మిట్‌ రోడ్‌షోలో లోకేశ్‌

  • కొరియా దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు

  • శాంసంగ్‌, హెచ్‌డీ కోస్‌, డెల్టా ఎక్స్‌, కుకూ ఎలకా్ట్రనిక్స్‌,

  • మోటివ్‌ లింక్‌, సిన్‌ హ్యూప్‌ ప్రతినిధులతో సమావేశం

  • పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం.. సానుకూల స్పందన ’

అమరావతి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌-కొరియా భాగస్వామ్యంలో కొత్త అఽధ్యాయం ప్రారంభమవుతోందని ఐటీ, విద్య, ఎలకా్ట్రనిక్స్‌ శాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. దక్షిణకొరియా పర్యటనలో ఉన్న ఆయన ఆరో రోజు శుక్రవారం సియోల్‌లో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. పెట్టుబడిదారులతో శాశ్వత భాగస్వామ్యం నిర్మించడమే తమ లక్ష్యమని అన్నారు. ఏపీపై విశ్వాసంతోనే కియ మోటార్స్‌ పెట్టుబడులు పెట్టిందని పేర్కొన్నారు. కొరియా మ్యానుఫ్యాక్చరింగ్‌, లాజిస్టిక్స్‌, గేట్‌వేగా ఏపీని తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఏపీ అభివృద్ధి ప్రయాణంలో కొరియా కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు. కొరియాతో ఏపీది విజయవంతమైన భాగస్వామ్యమని అన్నారు. కొరియాలో తన మిత్రుడొకరు ‘పల్లి పల్లి మంత్రి’ అంటూ చేసిన వ్యాఖ్యను పెద్ద ప్రశంసగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ‘పల్లి పల్లి’ అంటే .. త్వరత్వరగా, వేగంగా అని అర్థమని వివరించారు. కొరియా భాగస్వామ్యంతో పూర్తిస్థాయి ఇండస్ట్రియల్‌ ఎకోసిస్టమ్‌ నిర్మించడమే తమ లక్ష్యమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని చెప్పారు. ఏటా 21 బిలియన్‌ డాలర్ల వస్తు రవాణా చేయడం ఏపీ సామర్థ్యమని చెప్పారు. స్పీడ్‌, స్టెబిలిటీ, సర్వీసు వేగవంతంగా ఆమోదించడమే ఏపీ విధానమని లోకేశ్‌ చెప్పారు. ఏపీ-కొరియా భాగస్వామ్యంలో మొదటి అధ్యాయం ఆటోమొబైల్‌, రెండో అధ్యాయం ఎలకా్ట్రనిక్స్‌, మూడో అధ్యాయం అందరూ కలసి ఏపీ నిర్మాణంలో కీలకమైన ఏఐ, గ్రీన్‌ ఎనర్జీ, అధునాతన తయారీ రంగాల్లో కలసి అడుగులు వేస్తూ ముందుకు సాగాలన్నారు.


సముద్ర రవాణా, షిప్‌ బిల్డింగ్‌ రంగంలో..

హెడ్‌ డీ కోస్‌ గ్లోబల్‌ బిజినెస్‌ డైరెక్టర్‌ క్వోన్‌ యంగ్లూన్‌తో లోకేశ్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో సముద్ర రవాణా, షిప్‌ బిల్డింగ్‌ కేంద్రాలను స్థాపించాలని కోరారు. రాష్ట్రానికి గూగుల్‌ డేటాసెంటర్‌, ఆర్సెల్లార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌, ఫైటర్‌ జెట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ తయారీ యూనిట్‌ వస్తున్నాయన్నారు. క్వోన్‌ యంగ్లూన్‌ మాట్లాడుతూ.. ఏపీలో హెచ్‌డీ కోస్‌ షిప్‌ బిల్డింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు ప్రతినిధులను పంపుతామన్నారు.

‘బెస్‌’ తయారీ యూనిట్‌ స్థాపించండి

మిషన్‌ విజన్‌, ఎడ్జ్‌ ఏఐ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌(బీఈఎస్ఎస్)లో ప్రత్యేకతలు కలిగిన డెల్టా ఎక్స్‌ దక్షిణ కొరియా ఫౌండర్‌ అండ్‌ సీఈవో స్టీవెన్‌ కిమ్‌, ఆ సంస్థ నాయకత్వ బృందంతో లోకేశ్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పోర్టు యాక్సెస్‌ సహా మౌలిక సదుపాయాలు కలిగిన ఏపీలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ యూనిట్‌ను నెలకొల్పాలని కోరారు. త్వరలో నిర్ణయాన్ని ప్రకటిస్తామని స్టీవెన్‌ అన్నారు. అమరావతి లేదా విశాఖలో కోట్రా/న్వెస్ట్‌ కొరియా కార్యాలయం ప్రారంభించాలని ఇన్వెస్ట్‌ కొరియా కమిషనర్‌ కిమ్‌టే హ్యుంగ్‌ను లోకేశ్‌ కోరారు. దక్షిణ భారతదేశంలో ఇదే మొదటి జాతీయ ఉప కోట్రా కార్యాలయం అవుతుందని అన్నారు. నవంబరు 12, 13 తేదీల్లో విశాఖ సదస్సులో పాల్గొనాలని కోరారు. రాష్ట్రంలో గృహోపకరణాల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు కుకూ ఎలక్ట్రానిక్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది. సియోల్‌లో కుకూ ఎలక్ట్రానిక్స్ ఓవర్సీస్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ హెచ్‌వోడీ చో హాన్‌ చుల్‌తో లోకేశ్‌ సమావేశమయ్యారు.


శ్రీసిటీలో కుకూ యూనిట్‌ను స్థాపించేందుకు అనువైన ప్రాంతంగా చుల్‌కు వివరించారు. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్‌ పవర్‌ ఎలక్ట్రానిక్స్, సాపివ్‌ కాంపోనెంట్స్‌ తయారీ సంస్థ మోటివ్‌ లింక్‌ శ్రీసిటీలో తమ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సానుకూలంగా స్పందించింది. ఆ సంస్థ సీఈవో కిమ్‌కి హాన్‌, ఇంటర్నేషనల్‌ సేల్స్‌ అండ్‌ రీసెర్చ్‌ జనరల్‌ మేనేజర్‌ బైద్యశర్మతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు(పీసీబీ)ల తయారీలో ప్రఖ్యాతి గాంచిన సిన్‌ హ్యూప్‌ ఎలక్ట్రానిక్స్ చైర్మన్‌ టేహూకిమ్‌నూ కలిశారు. సన్‌హ్యూ్‌ప ఎలక్ట్రానిక్స్ ను రాష్ట్రానికి విస్తరించాలని నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్రంలో ఎండ్‌ టు ఎండ్‌ పీసీబీ క్లస్టర్‌ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వంతో కలసి పనిచేయాలని కోరారు. ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకుంటామని టేహూకిమ్‌ చెప్పారు.


ఆటో ఇండస్ట్రీస్‌ సమావేశంలో లోకేశ్‌

సియోల్‌లో కొరియా ఆటో ఇండస్ట్రీస్‌ కో-ఆపరేటివ్‌ ఏజెన్సీ చైర్మన్‌ టేక్‌ సుంగ్‌ బీ నేతృత్వంలో జరిగిన కొరియా ఆటో ఇండస్ట్రీస్‌ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి లోకేశ్‌ పాల్గొన్నారు. సుస్థిర ఎలక్ట్రిక్‌ మొబిలిటీ పాలసీ 4.0 కింద ఏపీలో విస్తృతమైన ఆటోమోటివ్‌ ఈవీ ఎకో సిస్టమ్‌ అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఏపీఎ్‌సఆర్టీసీ ఫ్లీడ్‌ విద్యుదీకరణ, గ్రీన్‌ కారిడార్లలో ప్రతి 35 కిలోమీటర్లకు ఒక ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు, ఈ-మొబిలిటీ నగరాలకు ఈవీ ఆర్‌ అండ్‌ డీ గ్రాంటు, పుంగనూరు ఈవీ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈవీ మాగ్నెట్‌ కోసం కేంద్రం సహకారంతో రేర్‌ ఎర్త్‌ కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. చెన్నై, బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో 100 కిలోమీటర్ల పరిధిలో ఆటోమోటివ్‌ విడిభాగాల ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందులో కియ, దాని అనుబంధ సంస్థలతో పాటు అశోక్‌ లేలాండ్‌, ఇసుజు మోటార్స్‌, హీరో మోటో కార్ప్‌, అమరరాజా, అపోలో టైర్స్‌, భారత్‌ ఫోర్జ్‌ వంటి ప్రధాన సంస్థలు అంతర్భాగంగా ఉన్నాయని వెల్లడించారు. ఈవీ పవర్‌ ట్రెయినీల కోసం అకాడమీ ఏర్పాటుకు ముందుకురావాలని కోరారు.

అమరావతిలో ‘శాంసంగ్‌’ విభాగం

శాంసంగ్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (గ్లోబల్‌ ఎఫైర్స్‌) యంగ్‌ జో యున్‌, గ్లోబల్‌ పబ్లిక్‌ ఎఫెర్స్‌ హెడ్‌ నామ్‌ సూ పార్క్‌తో లోకేశ్‌ సమావేశమయ్యారు. ప్రత్యేక శాంసంగ్‌ సిటీని ఏపీలో నిర్మించాలన్నారు. డేటా సెంటర్లు, సర్వర్‌ తయారీ సర్వీసింగ్‌తో కూడిన పూర్తి ఏఐ కంప్యూట్‌ స్టాక్‌ కోసం రాష్ట్రాన్ని శాంసంగ్‌ కేంద్రంగా మార్చాలని కోరారు. మొబైల్‌, డివైస్‌ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో 133 క్యూబిట్‌ ఐబీఎం క్వాంటం సిస్టమ్‌-2పై పరిశోధన చేయడానికి శాంసంగ్‌ పరిశోధన, అభివృద్ధి విభాగాన్ని అమరావతి క్వాంటం వ్యాలీలోకి తీసుకురావాలని కోరారు.

Updated Date - Jul 11 , 2026 | 04:27 AM