నేడు సింగపూర్‌లో లోకేశ్ వరుస భేటీలు
ABN , Publish Date - May 11 , 2026 | 04:20 AM
సింగపూర్ వెళ్తున్న రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్, మానవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు. ఉదయం పది గంటల నుంచి..
అమరావతి, మే 10(ఆంధ్రజ్యోతి): సింగపూర్ వెళ్తున్న రాష్ట్ర ఐటీ, ఎలకా్ట్రనిక్స్, మానవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు. ఉదయం పది గంటల నుంచి 11.30 గంటల దాకా ఎంటీఐ కార్యాలయంలో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2.30 గంటల దాకా సన్‌సిటీలో కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ (సీఐసీ) సీఈవో, సీఎఫ్ సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకూ సన్ టెక్ సిటీ డీపీ ఆర్కిటెక్ట్స్ సమావేశంలో పాల్గొంటారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఈ సమావేశాల్లో వెలిబుచ్చిన ఆలోచనా విధానాలను రాష్ట్రంలో అమలు చేయడంపై లోకేశ్ దృష్టి సారిస్తారు. సింగపూర్‌లో ఇటీవల మంత్రుల బృందం చేసిన అధ్యయనాంశాలను రాష్ట్రంలో అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రధానంగా అమరావతిలోని మౌలిక సదుపాయల కల్పనతో పాటు.. నగరాభివృద్ధి కోసం సింగపూర్ టెక్నాలజీని వినియోగించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. సోమవారం నాటి సింగపూర్ పర్యటనలో తెలుసుకున్న అంశాలను రాష్ట్రంలో అమలు చేయడంపై మంత్రి లోకేశ్ ఫోకస్ పెడతారని అధికాకవర్గాలు వెల్లడించాయ.