దశాబ్దాల ‘సీమ’ కల సాకారం: లోకేశ్
ABN , Publish Date - Jul 04 , 2026 | 04:55 AM
‘సీమ ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంతో మరో చారిత్రాత్మక అడుగు వేశామని మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు.
అమరావతి, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ‘సీమ ప్రజల దశాబ్దాల కల నెరవేరుతోంది. రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనుల ప్రారంభంతో మరో చారిత్రాత్మక అడుగు వేశామని మంత్రి లోకేశ్ ఎక్స్‌లో పేర్కొన్నారు. రాయలసీమ రైజింగ్ హ్యాష్ ట్యాగ్‌తో చేసిన పోస్టులో ‘ఇచ్చిన మాట ప్రకారం క్షేత్రస్థాయిలో పనులు వేగవంతం చేశాం. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు రాయలసీమ మేజర్ ఇండస్ట్రియల్ హబ్‌గా మారబోతోంది. ఏపీని అభివృద్ధి పథాన నిలపాలన్న కూటమి ఉక్కుసంకల్పానికి నిదర్శనం ఈ స్టీల్ ప్లాంట్’ అన్నారు. కాగా, సీఎం చంద్రబాబు పనులు ప్రారంభించిన కడప స్టీల్ ప్లాంట్ దేశంలోనే తొలి గ్రీన్ ఎనర్జీ ఆధారిత ఉక్కు కర్మాగారంగా నిలవనుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్తు రంగంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.