డీఎస్సీపై చర్చకు సై!
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:07 AM
‘నేను జగన్‌రెడ్డి ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఉన్నాను. డీఎస్సీపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమే. జగన్‌కు దమ్ముంటే స్పందించాలి’ అని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు.
దమ్ముంటే జగన్ స్పందించాలి
ఆయన ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఉన్నా..
గొడ్డలి పార్టీ నేతల్లా పారిపోయే రకం కాదు
మళ్లీ మళ్లీ టీచర్ పోస్టులు భర్తీచేస్తాం: లోకేశ్
జగన్‌ను ‘బెంతాహై’ అనొచ్చు
పులివెందుల ఎమ్మెల్యే జగన్‌ను ‘బెంతాహై(బెంగళూరు-తాడేపల్లి-హైదరాబాద్)’ అనడం సబబేనని లోకేశ్ అన్నారు. ఆయన బెంగళూరులో మూడు రోజులు, తాడేపల్లిలో ఒక్క రోజు, హైదరాబాద్‌లో ఇంకో మూడు రోజుల వంతున ఉంటారు. అందుకే ఆయన్ను బెంతాహైగా పిలవడం సమంజసంగా ఉంటుంది’ అని చెప్పారు.
విజనరీకి, ప్రిజనరీకి తేడా ఉంటుంది. ప్రిజనరీ ఎప్పుడూ జైలు వైపు చూస్తుంటాడు.. కానీ విజనరీ ఎప్పుడూ ప్రజా సంక్షేమం గురించే ఆలోచిస్తారు.
- మంత్రి లోకేశ్
మంగళగిరి, జూన్ 17(ఆంధ్రజ్యోతి): ‘నేను జగన్‌రెడ్డి ఇంటికి 200 మీటర్ల దూరంలోనే ఉన్నాను. డీఎస్సీపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమే. జగన్‌కు దమ్ముంటే స్పందించాలి’ అని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు. ‘గొడ్డలి పార్టీ నేతల్లా తాను పారిపోయే రకం కాదు.. డీఎస్సీపై ఎలాంటి అనుమానాలున్నా సమాధానం ఇచ్చేందు కు సిద్ధంగా ఉన్నా. జగన్ ఎన్ని జన్మలెత్తినా డీఎస్సీని ఆపలేరు. ఆయన హయాంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే హారిజాంటల్ రిజర్వేషన్ అంటే ఏమిటో అర్థమై ఉండేది. డీఎస్సీని పూర్తి పారదర్శకంగా నిర్వహించాం. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్లను అధ్యయనం చేశాకే కచ్చితమైన నోటిఫికేషన్ ఇచ్చాం’ అని తెలిపారు. తాడేపల్లి పాతూరు రోడ్డులో రూ.1167 కోట్ల వ్యయంతో చేపట్టనున్న భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులకు బుధవారం ఆయన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దేశ చ రిత్రలో ఎక్కడా లేని విధంగా 150 రోజుల్లో 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేశామన్నారు. ‘మళ్లీ టెట్ పరీక్ష జరుగుతుంది, మళ్లీ డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం.. టీచర్ ఉద్యోగాలను మళ్లీ మళ్లీ భర్తీ చేస్తాం.
సాక్షి క్యాలెండర్ కాదిది... పదివేల పోస్టులతో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేశాం. మొదటిసారి డీఎస్సీలో హారిజాంటల్ రిజర్వేషన్ అమలుచేశాం. దీని గురించి యువత కూడా తెలుసుకోవాలి. ఈ రిజర్వేషన్ పాటించకపోతే సబర్వాల్ జడ్జిమెంట్ అనేది ఒకటుం ది. ఆ జడ్జిమెంట్‌ను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలే కోర్టులో వేసి స్టే తీసుకొస్తారు. వారే డీఎస్సీ జరక్కుం డా ఇప్పటికి 240 కేసులను వేశారు. ఇప్పుడు మళ్లీ కులం కార్డు తీసుకొస్తున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే.. 2014-19 మధ్య కూడా డీఎస్పీ పదోన్నతుల్లో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యమిచ్చామని దుష్ప్రచార ం చేశారు.ప్రజలూ నమ్మారు. తర్వాత వాస్తవాలు తెలిశాయి. ఇప్పుడు కూడా పనికిమాలిన ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని పెట్టుకుని స్పోర్ట్స్ కోటాలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఉద్యోగాలిచ్చామంటూ ప్రచారం చేస్తున్నారు. మేం వాస్తవాలన్నీ వివరించాం. సదరు వ్యక్తి క్షమాపణలు చెప్పాలి కదా! బురదజల్లి పారిపోతున్నారు’ అని ధ్వజమెత్తారు.
ఇక్కడుంటే కదా తెలిసేది!
జగన్ ఏపీలో నివాసం ఉంటే వాస్తవాలు, జరుగుతున్న అభివృద్ధి ఏమిటో తెలుస్తాయని లోకేశ్ అన్నారు. ‘ఎన్నికల హమీలను పద్ధతి ప్రకారం నెరవేరుస్తున్నాం. రెండేళ్లలో దేశంలో ఎక్కడా లేనివిధం గా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేప ట్టాం. దేశానికి వచ్చే పెట్టుబడులలో 25 శాతం ఏపీకే వస్తున్నాయి. దీనికి సీబీఎన్ బ్రాండ్ ఇమేజే కారణం. 76 ఏళ్ల వయస్సులోనూ చంద్రబాబు కొబ్బరికాయ తీసుకుని ఆయనే కొడతారు. సైకిల్ తొక్కుతారు. పులివెందుల ఎమ్మెల్యేకు ఇవి కూడా చేతకావు’ అని ఎద్దేవా చేశారు.