నంద్యాలలో ట్రాక్టర్‌తో భూమి దున్నిన ఎంపీ శబరి
ABN , Publish Date - Jun 30 , 2026 | 06:37 AM
నంద్యాల జిల్లా కేంద్రంలోని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం ఏరువాక వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నంద్యాల రూరల్, జూన్ 29(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా కేంద్రంలోని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం ఏరువాక వేడుకలు ఘనంగా నిర్వహించారు. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ట్రాక్టర్‌తో భూమిని కలియదున్ని సందడి చేశారు. అనంతరం గొర్రుతో విత్తనం వేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ఏరువాక వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.