Share News

మట్టిలో మాణిక్యాలకు విమానయోగం!

ABN , Publish Date - May 05 , 2026 | 04:38 AM

మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్న ఉద్దేశంతో.. ప్రభుత్వ విప్‌, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

మట్టిలో మాణిక్యాలకు విమానయోగం!

నందిగామ, మే 4(ఆంధ్రజ్యోతి): మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలన్న ఉద్దేశంతో.. ప్రభుత్వ విప్‌, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలి ఏడాది నుంచే ఆమె తన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విమానం ఎక్కే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది టెన్త్‌లో ఉత్తమ ప్రతిభ చూపిన కంచికచర్ల మండల విద్యార్థి ఎస్‌కె అర్షియనాజ్‌ (589 మార్కులు), నందిగామ మండల విద్యార్థి ప్రజాప్రతి ప్రవీణ్‌ (576), వీరులపాడు మండల విద్యార్థి స్వరం వర్షిత (571), ముప్పాళ్ల గురుకుల పాఠ శాల విద్యార్థి పల్లెపోగు వెన్నెల (567), చందర్లపాడు మండల విద్యార్థి నారిశెట్టి జగదీశ్‌ ఆదిత్య (559), నందిగామ విద్యార్థి ఉప్పులూరి సోనీప్రియ (549)లను ఈ యాత్రకు ఎంపిక చేశారు. మంగళవారం ఉదయం తంగిరాల సౌమ్యతో కలిసి ఈ విద్యార్థులు విజయవాడ నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణం చేయనున్నారు.

Updated Date - May 05 , 2026 | 04:39 AM