Share News

కూటమితోనే ముందుకెళ్లాలి

ABN , Publish Date - Jul 16 , 2026 | 05:32 AM

కూటమి పార్టీలతో కలిసి వెళుతున్న తరుణంలో చిన్న చిన్న ఇబ్బందులున్నప్పటికీ సర్దుకుని జనసైనికులు కలసి వెళ్లాలని ఏలూరు జిల్లా ఇన్‌చార్జి, మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు.

కూటమితోనే ముందుకెళ్లాలి

  • వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టండి: మంత్రి నాదెండ్ల

కైకలూరు, జూలై 15(ఆంధ్రజ్యోతి): కూటమి పార్టీలతో కలిసి వెళుతున్న తరుణంలో చిన్న చిన్న ఇబ్బందులున్నప్పటికీ సర్దుకుని జనసైనికులు కలసి వెళ్లాలని ఏలూరు జిల్లా ఇన్‌చార్జి, మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ‘జనసేన పార్టీ చర్చావేదిక’ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా కైకలూరులో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడారు. ‘పార్టీని బలోపేతం చేయడం, గ్రామస్థాయిలో జనసైనికులు పడుతున్న కష్టాలు, సమస్యలు వంటివి తెలుసుకునేందుకే ఈ చర్చావేదికను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని కైకలూరు నుంచే ప్రారంభిస్తున్నాం. సోషల్‌ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను స్థానికంగా ప్రజలకు తెలిపేందుకు ఈ వేదిక దోహదపడుతుంది. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందడానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. కూటమిని రాష్ట్ర వ్యాప్తంగా అంకితభావంతో అందరూ కలసిమెలసి ముందుకు తీసుకువెళ్లాలి’ అంటూ సూచించారు.

Updated Date - Jul 16 , 2026 | 05:32 AM