కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మంకు బ్రెయిన్ స్ట్రోక్
ABN , Publish Date - Jul 17 , 2026 | 04:33 AM
కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ఆయన్ను వెంటనే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని..
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన చంద్రబాబు, లోకేశ్
అమరావతి, తాడేపల్లి, జూలై 16(ఆంధ్రజ్యోతి): కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ఆయన్ను వెంటనే గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వైద్యులు, బ్రహ్మం కుటుంబ సభ్యులతో సమన్వయం చేసుకుని బ్రహ్మంకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. బ్రహ్మం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బ్రహ్మం ఆరోగ్య పరిస్థితి త్వరలోనే బాగవుతుందని మంత్రి లోకేశ్ ఆకాంక్షించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం ఆసుపత్రికి వెళ్లి బ్రహ్మం చౌదరిని పరామర్శించారు. ఐసీయూలో ఉన్న ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని మణిపాల్ వైద్యుల బృందం ప్రకటించింది.