దేశం నుంచి గాంధీని దూరం చేయలేరు!
ABN , Publish Date - Jan 29 , 2026 | 03:52 AM
గాంధీజీ ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసం ‘గాంధీజీ సందేశ్ యాత్ర’ నిర్వహిస్తున్నానని సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు.
‘గాంధీజీ సందేశ్ యాత్ర’ ప్రారంభించిన రఘువీరా
మడకశిర రూరల్, జనవరి 28(ఆంధ్రజ్యోతి): గాంధీజీ ఔన్నత్యాన్ని చాటి చెప్పడం కోసం ‘గాంధీజీ సందేశ్ యాత్ర’ నిర్వహిస్తున్నానని సీడబ్ల్యూసీ సభ్యుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. దేశం నుంచి గాంధీజీని ఎవరూ వేరు చేయలేరని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం నుంచి బుధవారం ఆయన ‘గాంధీజీ సందేశ్ యాత్ర’ను ప్రారంభించారు.