‘మైసూర్’ టవర్..!
ABN , Publish Date - Feb 08 , 2026 | 11:16 PM
కోసిగి మండల కేంద్రంలో కొనసాగుతున్న రేణుకా ఎల్లమ్మ జాతరలో ఓ భారీ మైసూర్ పాక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
కోసిగి, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): కోసిగి మండల కేంద్రంలో కొనసాగుతున్న రేణుకా ఎల్లమ్మ జాతరలో ఓ భారీ మైసూర్ పాక్ అందరినీ ఆకట్టుకుంటోంది. కోసిగికి చెందిన స్వీట్‌షాప్ యజమాని బద్రీనాథ్ తన దుకాణంలో 11 అడుగుల మైసూర్ పాక్‌ను తయారు చేయించి ప్రదర్శనకు ఉంచాడు. ఈ పొడవైన మైసూర్ పాక్‌పై మంత్రాలయం శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసి తన భక్తిని చాటుకున్నాడు. జాతరలో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఈ భారీ మైసూర్‌పాక్‌ను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది సెల్ఫీలు తీసుకుంటూ షేర్ చేస్తున్నారు. అదేవిధంగా మరో స్వీట్ షాప్ యజమాని విశ్వనాథ్ తన దుకాణంలో 10 అడుగుల మైసూర్ పాక్ టవర్‌ను ఏర్పాటు చేసి దానిపై రేణుకా ఎల్లమ్మ చిత్రపటాన్ని ఉంచి భక్తిని చాటుకున్నాడు.