ఏపీ భవన్ జేసీగా ఎంవీఎస్ రామారావు
ABN , Publish Date - Jan 24 , 2026 | 06:23 AM
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ (ఏపీ భవన్) జాయింట్ కమిషనర్‌గా ఎంవీఎస్ రామారావు నియమితులయ్యారు.
న్యూఢిల్లీ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ (ఏపీ భవన్) జాయింట్ కమిషనర్‌గా ఎంవీఎస్ రామారావు నియమితులయ్యారు. ఇప్పటివరకు భవన్ డిప్యూటీ కమిషనర్ (ప్రోటోకాల్)గా విధులు నిర్వర్తిస్తున్న రామారావు జాయింట్ కమిషనర్‌గా పదోన్నతి పొందడంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను స్పెషల్ కమిషనర్ ఆర్జా శ్రీకాంత్, డిప్యూటీ కమిషనర్ వెంకటరమణ, లైజన్ ఆఫీసర్లు కదిరి మోహనప్రభాకర్, సురేష్‌బాబు తదితరులు సత్కరించారు.