షార్ డైరెక్టర్‌గా ముత్తు చెళియన్
ABN , Publish Date - Jun 03 , 2026 | 01:45 AM
శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన డైరెక్టర్‌గా ఎస్.ముత్తు చెళియన్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు డైరెక్టర్‌గా పనిచేసిన ఈఎస్ పద్మకుమార్ పదవీ కాలం మే 31తో ముగిసింది.ఆయన స్థానంలో షార్ అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్న ముత్తు చెలియన్‌ను నియమించారు. తమిళనాడుకు చెందిన ముత్తు చెళియన్ 1991లో శ్రీహరికోటలో ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. మూడు దశాబ్దాలకు పైగా అంతరిక్ష రంగంలో విశేష సేవలందించారు.
సూళ్లూరుపేట, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నూతన డైరెక్టర్‌గా ఎస్.ముత్తు చెళియన్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు డైరెక్టర్‌గా పనిచేసిన ఈఎస్ పద్మకుమార్ పదవీ కాలం మే 31తో ముగిసింది.ఆయన స్థానంలో షార్ అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్న ముత్తు చెలియన్‌ను నియమించారు. తమిళనాడుకు చెందిన ముత్తు చెళియన్ 1991లో శ్రీహరికోటలో ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరారు. మూడు దశాబ్దాలకు పైగా అంతరిక్ష రంగంలో విశేష సేవలందించారు.ఈ సందర్భంగా నూతన డైరెక్టర్‌ను పద్మకుమార్ సహా షార్‌లోని అన్ని విభాగాలకు చెందిన ఉద్యోగులు పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.