పకడ్బందీగా నమోదు చేయాలి
ABN , Publish Date - Feb 09 , 2026 | 11:42 PM
రైతుల భూములకు సంబందించిన వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ ఆదేశించారు.
ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్
రెవెన్యూ అధికారులపై ఆగ్రహం
హొళగుంద, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి) : రైతుల భూములకు సంబందించిన వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ అజయ్ కుమార్ ఆదేశించారు. సోమవారం మండలంలోని పెద్ద గోనెహాల్ గ్రామంలో రీ సర్వే పూర్తి అయిన సందర్భంగా రికార్డులను పరిశీలించారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులు పరిశీలించారు. పట్టాదార్ పాస్ పుస్తకాలకు సంబంధించిన సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆనలైనలో రైతుల వివరాలు తప్పుగా నమోదు అయినట్లు ఆయన దృష్టికి రావడంతో రెవెన్యూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేనెలలోగా తప్పులు లేకుండా రాజముద్రతో ఉన్న పాస్ పుస్తకాలు రైతులకు అందజేయాలని అన్నారు. సమావేశంలో తహసీల్దార్ నిజాముద్దీన రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ ముకుంద రావు, ఆర్‌ఐ మహేష్, సర్వేయర్ వీఆర్‌వోలు పాల్గొన్నారు.