చట్టాలపై అవగాహన ఉండాలి
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:31 AM
విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి సుభాష్ సూచిం చారు.
మొదటి అదనపు జూనియర్ సివిల్
న్యాయాధికారి సుభాష్
ఆదోని, ఫిబ్రవరి 24 (ఆంధ్ర జ్యోతి): విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి సుభాష్ సూచిం చారు. ఆదోని మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని శంకర్‌నగర్‌లోని వింద్యశ్రీ పాఠశాలలో న్యాయ విజ్ఞాన స దస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయాధికారి సుభాష్ హా జరై మాట్లాడారు. నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థులకు అందుబాటులో అనేక కోర్సులు ఉన్నాయని, చదువుతో పా టు క్రీడల్లో రాణించాలని సూచించారు. పే దలకు అందుబాటులో ఉన్న ఉచిత న్యా య సహాయం గురించి, వివాదాల పరిష్కారానికి వేదికైన లోక్ అదాలత్ ప్రాముఖ్యత ను ఆయన వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎం.వి.లోకే్‌షకుమార్, పూజారి ఈరన్న, పాఠశాల కరస్పాండెంట్ నాగేంద్ర, ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు.