Share News

చట్టాలపై అవగాహన ఉండాలి

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:33 PM

చట్టాలపై అవగాహనతోనే సామాజిక న్యాయం సాధ్యమని మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి సుభాష్‌ అన్నారు.

 చట్టాలపై అవగాహన ఉండాలి
మాట్లాడుతున్న న్యాయాధికారి సుభాష్‌

విద్యార్థులు అదనపు

నైపుణ్యాలు పెంచుకోవాలి

జూనియర్‌ సివిల్‌

న్యాయాధికారి సుభాష్‌

ఆదోని, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): చట్టాలపై అవగాహనతోనే సామాజిక న్యాయం సాధ్యమని మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి సుభాష్‌ అన్నారు. శుక్రవారం సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని అరుణజ్యోతినగర్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి సుభాష్‌ పాల్గొని మాట్లాడారు. ప్రజలందరూ చట్టాలపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. అప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. విద్యార్థులు కేవలం డి గ్రీ పూర్తి చేస్తే సరిపోదని, మా రుతున్న కాలానికి అనుగుణం గా అదనపు అర్హతలు సాధించాలని సూచించారు. టైపింగ్‌, షార్ట్‌ హ్యాండ్‌, కంప్యూటర్‌ వం టి సాంకేతిక కోర్సుల్లో నైపుణ్యం సంపాదిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా పొందవచ్చని వివరించారు. నేరాల పట్ల అప్రమత్తత, మద్యం తాగి వాహనాలు నడపడం నేరమని, అ టువంటి వారిపై చట్ట ప్రకారం రూ.10 వేలు జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా తరలించడం, విక్రయించడం వంటి నేరాలకు పాల్పడవద్దన్నారు. సమాజంలో నేరరహిత వాతావరణాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సమావేశంలో ప్రముఖ న్యాయవాది ఎం.వి.లోకే్‌షకుమార్‌, త్రీటౌన్‌ ఎస్‌ఐ దేవదాస్‌, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:33 PM