Share News

ఎ గ్రేడ్‌ సాధించాలి

ABN , Publish Date - Jan 23 , 2026 | 11:50 PM

లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ఎ గ్రేడ్‌ సాధించాలని కలెక్టర్‌ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు.

 ఎ గ్రేడ్‌ సాధించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు సంబంధించి నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స ఇండికేటర్స్‌ (కేపీఐలు) లో ప్రస్తుతం బి, సి గ్రేడ్లలో ఉన్న ప్రభుత్వ శాఖలు తమ పనితీరును మరింత మెరుగుపరు చుకుని లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసి ఎ గ్రేడ్‌ సాధించాలని కలెక్టర్‌ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్ర వారం ఆమె కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స హాలులో శాఖల వారీగా నిర్దేశించిన కీ పెర్ఫార్మెన్స ఇండికేటర్స్‌ ప్రగతిపై సమీక్ష స మావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. అన్ని శాఖలకు కలిపి కేటాయించిన 312 పారామీటర్లలో ప్రస్తుత గణాంకాల ప్ర కారం జిల్లాలో 30 శాఖలు బి గ్రేడ్‌లో, 45 శాఖలు సి గ్రేడ్‌లో ఉ న్నాయన్నారు. ఈ శాఖలు సమష్టిగా కృషి చేసి పనితీరును మెరుగుపరుచుకొని ఎ గ్రేడ్‌ సాధించే దిశగా ముందుకు సాగాల న్నారు. జిల్లా స్థూల ఉత్పత్తికి సంబంధించిన కీలక ఆర్థిక సూచీల పై సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఈ సూచీల ఆధారంగానే జిల్లా అభివృద్ధి స్థాయిని అంచనా వేయబడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల అమలులో తక్కువ శాతం నమోదైన విభాగాల్లో లక్ష్యాలను పూర్తిస్థాయిలో సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. డేటా ఎంట్రీ విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి నెల 5లోగా ఆనలైనలో నమోదు చేయాలన్నారు. సమావేశంలో సీపీఓ ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 11:50 PM