వనికెందిన్నెలో హత్య
ABN , Publish Date - Feb 13 , 2026 | 10:52 PM
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం వనికెందిన్నె గ్రామంలో చిటికెల వెంకటేశ్వర్లు(55) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.
శిరివెళ్ల, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి) : నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం వనికెందిన్నె గ్రామంలో చిటికెల వెంకటేశ్వర్లు(55) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఎస్సీ కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు కూలీ పనులు చేసుకుంటూ ఒంటరిగా జీవిస్తున్నాడు. ఓ వ్యక్తి శుక్రవారం ఉదయం వెంకటేశ్వర్లును పనికి పిలిచేందుకు వెళ్లి చూడగా మంచంపై రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. దీంతో అతను పోలీసులకు, రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. శిరివెళ్ల సర్కిల్ సీఐ రాము సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు వెంకటేశ్వర్లు తలపై బలంగా కొట్టి చంపినట్లు గమనించారు. సీఐ రాము క్లూస్ టీం, ఫోరెన్సిక్ సిబ్బందిని పిలిపించి ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వనికెందిన్నె గ్రామ వీఆర్వో రవీంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.