Share News

మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌కు లోకేశ్‌ సత్కారం

ABN , Publish Date - Jun 23 , 2026 | 05:36 AM

పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖ సినీనటులు మాగంటి మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్ర మంత్రి లోకేశ్‌ ఘనంగా సత్కరించారు.

మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌కు లోకేశ్‌ సత్కారం

  • నేడు పద్మశ్రీ అవార్డుల స్వీకారం.. ఢిల్లీకి చేరుకున్న సీనియర్‌ నటులు

న్యూఢిల్లీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన ప్రముఖ సినీనటులు మాగంటి మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌ను రాష్ట్ర మంత్రి లోకేశ్‌ ఘనంగా సత్కరించారు. మంగళవారం అవార్డులను స్వీకరించేందుకు ఢిల్లీకి వచ్చిన వీరిని మంత్రి లోకేశ్‌ కలుసుకొని జ్ఞాపికలతో సత్కరించారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, బైరెడ్డి శబరి, బీకే పార్థసారథి, చింతకాయల విజయ్‌, సానా సతీశ్‌.. మురళీమోహన్‌, రాజేంద్రప్రసాద్‌ను సన్మానించారు.

Updated Date - Jun 23 , 2026 | 05:36 AM