Share News

అటానమస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల సంఘం అధ్యక్షుడిగా ముప్పలనేని

ABN , Publish Date - Mar 14 , 2026 | 04:42 AM

అటానమస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. శుక్రవారం విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది.

అటానమస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల సంఘం అధ్యక్షుడిగా ముప్పలనేని

అమరావతి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): అటానమస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. శుక్రవారం విజయవాడలో జరిగిన సమావేశంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుడిగా ముప్పలనేని శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శిగా జయచంద్రారెడ్డి, కోశాధికారిగా వీవీ నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా ఎంవీ శ్రీనివాసబాబు, చంద్రమోహన్‌, సంయుక్త కార్యదర్శులుగా బి.కనకదుర్గ, ఎస్‌.కీర్తికుమార్‌ ఎన్నికయ్యారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాలేజీలకు ఎలాంటి కోతల్లేకుండా రూ.1,200 కోట్లు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 14 , 2026 | 04:42 AM