నేడు అవుట్‌సోర్సింగ్ మున్సిపల్ కార్మికుల సమ్మె
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:13 AM
మార్చి నెల జీతాల కోసం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు, మరో 8 వేల మంది ఎన్‌ఎంఆర్, బదిలీ కోవిడ్, డైలీ వేజ్ ఎంబుక్, అడిషనల్ వర్కర్స్, క్లాప్ డ్రైవర్లు సమ్మె చేయనున్నట్లు..
అమరావతి, ఏప్రిల్ 20(ఆంధ్రజ్యోతి): మార్చి నెల జీతాల కోసం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు, మరో 8 వేల మంది ఎన్‌ఎంఆర్, బదిలీ కోవిడ్, డైలీ వేజ్ ఎంబుక్, అడిషనల్ వర్కర్స్, క్లాప్ డ్రైవర్లు సమ్మె చేయనున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి నెల జీతాలు ఇంతవరకు ఇవ్వక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.